MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలను తరలించడంలో జాప్యం ఏర్పడుతుంది. పలు గ్రామాలలో రైతుల నుండి అధికారులు వరి ధాన్యం, మొక్కజొన్న ఉత్పత్తులను సేకరించి సంచులలో నింపారు. అయితే లారీలు రాకపోవడంతో ఆ ధాన్యం బస్తాలను గోదాములకు చేర్చడంలో జాప్యం ఏర్పడుతుంది. వర్షాలు పడితే ధాన్యం బస్తాలు తడిసిపోయే ప్రమాదం ఉంది.