ELR: ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం PHC వైద్యాధికారి డాక్టర్ కె.మురళీధర్ సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఓఆర్ఎస్ ద్రావణం, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. ఉపాధి హామీ కార్మికులు పనులను ఉదయాన్నే ముగించుకోవాలని ఆయన హితవు పలికారు.