VSP: ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం-కాచిగూడ మధ్య వన్ వే ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది. రైలు నంబర్ 08521 విశాఖపట్నం-కాచిగూడ వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 30న విశాఖపట్నం నుంచి సా. 5:30 గంటలకు బయలుదేరి రెండో రోజు ఉదయం 9:45కు కాచిగూడ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని కోరింది.