MDK: కౌడిపల్లి మండలం తునికి సమీపంలోని దేవుల తండా వద్ద మంగళవారం ఉదయం లారీ, ఆటో ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. స్థానికుల వివరాలు.. వెంకట్రావు పేట నుంచి నర్సాపూర్ వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.