IPLలో క్వాలిఫయర్-1 ఫలితంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. 2011లో ప్లేఆఫ్స్ వ్యవస్థ వచ్చాక జరిగిన 15 సీజన్లలో.. ఏకంగా 12 సార్లు తొలి క్వాలిఫయర్లో నెగ్గిన జట్లే ఛాంపియన్లుగా నిలిచాయి. 2013, 2016, 2017 మినహా, గత ఏడాది RCBతో సహా మిగిలిన అన్ని సీజన్లలో ఈ సెంటిమెంటే నిజమైంది. అయితే, ఇవాళ జరిగే క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే కప్పు గెలుస్తుందో లేదో చూడాలి.