SRD: మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం అన్ని రంగాల్లో ముందంజ ఉండాలని ఉద్దేశంతో ఈ భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేందుకు అందుబాటులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు.