జగిత్యాల ఆర్టీసీ డిపో పరిధిలో పని చేస్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ అశోక్‌పై అధికారులు చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులను విమర్శించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను వెంటనే PHB సేవల నుంచి తప్పించాలని బస్సు యజమానికి డిపో మేనేజర్ నోటీసు జారీ చేశారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీని గానీ, నాయకుడిని గానీ విమర్శించలేదని అశోక్ పేర్కొన్నారు.