కోనసీమ: టీడీపీలో సభ్యత్వం తీసుకుని పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతూ ఇటీవల మరణించిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా మంజూరైన ప్రమాద బీమా చెక్కులను మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం అందజేశారు. కె.గంగవరం మండలం అజమూరు కి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు బీమా సాయం అందించారు.