కోనసీమ: ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చొప్పెల్ల గ్రామానికి చెందిన రాయుడు త్రిమూర్తులు కడియపులంకలో నర్సరీ పనులకు వెళ్తుండగా, ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఆయన వాహనం ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో త్రిమూర్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.