E.G: మహానాడు -2027 సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలోని 10 క్లస్టర్స్లలో సమావేశ ప్రాంగణాల ఏర్పాట్లను టీడీపీ యువ నాయకులు మనోజ్ రెడ్డి, అనపర్తి టీడీపీ పరిశీలకులు పర్వత సురేష్ మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు మహానాడు పండుగను ఘనంగా, క్రమశిక్షణతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేసవికాలం దృష్ట్యా మంచినీరు, మజ్జిగ అందరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.