TG: శంషాబాద్(M) పెద్దషాపూర్లో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని BRS నేత హరీష్ రావు ఆరోపించారు. ‘ఆ 170 ఎకరాలు ప్రభుత్వ భూమేనని RDO ఆర్డర్ ఇచ్చారు. ఆ MROను బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారు. MRO ఆర్డర్‌పై ఎందుకు విచారణ చేయలేదు?’ అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధం లేకుంటే.. MRO ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.