PLD: మాచవరం (మం) విరిగిపడిన విద్యుత్ స్తంభాల మరమ్మతులు వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ 100కు పైగా స్తంభాలు నేలకొరిగాయి. ఏఈ శంకర్రావు ఆధ్వర్యంలో మంగళవారం క్రేన్లతో పనులు చేపట్టి, కరెంటు సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. వర్షాలు పడేటప్పుడు స్తంభాలను తాకవద్దని ఆయన హెచ్చరించారు. విద్యుత్ తీగలు తెగిపడిన నీటిలో నడవొద్దని ప్రజలకు హెచ్చరించారు.