TPT: సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్‌కు రెగ్యులర్ ఆర్డీవోగా దేవేంద్ర రెడ్డిని నియమితులు అయ్యారు. ఇప్పటివరకు ఇంఛార్జ్‌గా సేవలందించిన ఆయన ఇకపై పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన శాశ్వత నియామకంతో స్థానిక రెవెన్యూ పాలన మరింత మెరుగుపడనుంది. డివిజన్ పరిధిలోని భూ వివాదాల పరిష్కారం వేగవంతం కానుందని, ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుతాయని అధికారులు భావిస్తున్నారు.