TPT: రేణిగుంట రూరల్ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులకు టెస్టులు చేస్తున్నామని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా సరఫరాదారులు, పెడ్లర్ల వివరాలు సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.