GNTR: పొన్నూరు నియోజకవర్గంలో 22ఏ మినహాయింపు ద్వారా 7వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ జీవో 306 తెచ్చిన కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల హర్షం వ్యక్తం చేశారు. పదేళ్లుగా అసైన్డ్ భూముల్లో ఉంటున్న వారికి దీనివల్ల రిజిస్ట్రేషన్ హక్కులు వస్తాయన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని, త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అర్హులందరికీ హక్కు కల్పిస్తామన్నారు.