AP: పవన్ కళ్యాణ్‌ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని విధానాల వల్ల సింగిల్ స్క్రీన్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు. సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజ్ ఇవ్వడంతో పాటు, నిర్వహణ వ్యయం పెరుగుతున్నందున విద్యుత్ ఛార్జీలో కూడా రాయితీ ఇవ్వాలని కోరారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.