SRCL: అక్రమ వడ్డీ వ్యాపారులపై ఆరు కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో మంగళవారం తనిఖీ చేశామన్నారు. అక్రమ వడ్డీ వ్యాపారం నుంచి రూ. 1,39,65,000 విలువ గల డాక్యుమెంట్లు, రూ. 1,77,000 విలువగల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.