KMM: వరదల సమయంలో రాకపోకలు నిలిచిపోయే కట్ ఆఫ్ రహదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సీపీ సునీల్ దత్ సూచించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. అవసరమైనచోట్ల డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులను మరింతగా భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.