వరంగల్ కమిషనరేట్ పరిధిలో సోమవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 234 మంది వాహనదారులు మద్యం తాగి పట్టుబడ్డారు. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 56 కేసులు, సెంట్రల్ జూన్లో 59 కేసులు, ఈస్ట్ జోన్లో 59, వెస్ట్ జోన్లలో 50 కేసులు నమోదయ్యాయి. మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.