MDK: చిన్న శంకరంపేట మండలం మడూర్ హైస్కూల్లో పదవ తరగతిలో 500 లకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను సర్పంచ్ దివ్య లింగ గౌడ్ సన్మానించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని పేర్కొన్నారు. పై తరగతుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. విద్యార్థుల సన్మానంలో హెచ్ఎం రవీందర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.