దర్శకుడు ప్రశాంత్ నీల్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా రాబోతున్నట్లు సోషల్ మీడియాలో భారీగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. KGF’, ‘సలార్’ మూవీలతో మాస్ పల్స్ పట్టుకున్న నీల్.. మహేష్ కోసం ఒక పవర్ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్. ఒకవేళ వీరిద్దరి క్రేజీ కాంబో సెట్ అయితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్.