TG: మాజీ సీఎం కేసీఆర్ లంబాడీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చారని మాజీమంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క ఎకరాకైనా పోడు భూముల పట్టాలు ఇచ్చిందా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడీలు, గిరిజనులపై దౌర్జన్యం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సేవాలాల్ జయంతిని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని తెలిపారు.