జనగామ జిల్లాలో ఇప్పటివరకు 14.23 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇందులో 13.48 లక్షల క్వింటాళ్లు మిల్లులకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. 20,963 మంది రైతుల ఖాతాల్లో రూ. 340 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.మిల్లుల వద్ద 143 లారీలు నిలిచిపోవడంతో దిగుమతిని వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.