AP: SIR ప్రక్రియపై CEO వివేక్ యాదవ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. SIR ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాల పరిశీలన కోసం కార్యాచరణ రూపొందించామన్నారు. సమావేశానికి టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఎం నుంచి ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.