AP: మాజీ సీఎం జగన్‌ది ముమ్మాటికి గొడ్డలి పార్టీనే అని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి విమర్శించారు. జగన్ పాలనలో ఎన్ని హత్యలు జరిగాయో ఆధారాలతో నిరూపిస్తానని తెలిపారు. జగన్ అరాచకాలు భరించలేక ప్రజలు 11 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన ఇలాగే ఉంటే ఆ 11 సీట్లు సున్నాకు పడిపోతాయని వ్యాఖ్యానించారు.