GNTR: మంగళగిరిలో మంగళవారం ఏఐ ఆధారిత ఆరోగ్య సదస్సు, ‘మెడ్ టెక్ ఛాలెంజ్’ ఫైనల్స్ జరగనున్నాయి. ఈ పోటీలో 18 సంస్థలు తాము రూపొందించిన ఏఐ వైద్య సాంకేతికతలను ప్రదర్శించగా, ఉత్తమంగా నిలిచిన 12 సంస్థలకు మంత్రి సత్యకుమార్ రూ.40 లక్షల బహుమతులు అందజేస్తారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొనే ఈ సదస్సులో హెల్త్‌కేర్ రంగంలో ఏఐ వినియోగంపై చర్చించనున్నారు.