NTR: జిల్లాలో మంగళవారం 45-46°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని APSDMA అధికారులు హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉందని పేర్కొంటూ.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతూ, బయటికి వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ వినియోగించాలని తెలిపారు.