అన్నమయ్య: తంబళ్లపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇన్-పేషెంట్ల సంఖ్యను పెంచాలని DCHS లక్ష్మీకర్ సూచించారు. సోమవారం ఆయన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, వార్డులు, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే యూనిట్లను పరిశీలించారు. ఓపీ సంఖ్య, రాత్రి వైద్య సేవలు, ఉచిత భోజన సౌకర్యంపై ఆరా తీశారు. త్వరలోనే పోస్టుమార్టం సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.