E.G: జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 అంగన్వాడీ కార్యకర్తలు, 135 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె. శ్రీదేవి తెలిపారు. 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు గుర్తించామని చెప్పారు. స్థానిక అర్హత గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.