TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో అధికారులు ఆక్రమణలను తొలగించారు. బండ్లగూడ, కాళీ మందిర్, టిప్పూఖాన్పూల్, సన్‌సిటీ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.