MDK: గతంలో ఐదు మండలాలకు సేవలు అందించిన రామాయంపేట పశువుల ఆసుపత్రి నేడు పశువుల పాకగా మారిపోయింది. 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కనీస సౌకర్యాలు లేక అటు సిబ్బంది, ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా, వైద్యులు అందుబాటులో లేక రైతులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.