AP: మంగళగిరిలోని టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ ఆవరణలో BCCI ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు IPL ఫ్యాన్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో జరిగే నాలుగు కీలక మ్యాచ్‌లను LED స్క్రీన్ల ద్వారా క్రికెట్ అభిమానులు ఉచితంగా వీక్షించవచ్చు. స్టేడియం వాతావరణాన్ని తలపించేలా ఇక్కడ మ్యూజిక్, ఫుడ్ స్టాల్స్, పిల్లల కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలను కూడా సిద్ధం చేశారు.