KMR: భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కొండల్ రెడ్డి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు అదే గ్రామానికి చెందిన దూడ ఎల్లవ్వ (55)గా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.