BPT: కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల డీఎస్పీ హెచ్.చంద్రమౌళి విచ్చేసి చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.