HNK: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేందర్ రెడ్డి, సిద్ధం నరేష్‌లను వేలేరు మండల బీజేపీ అధ్యక్షుడు రాజు యాదవ్, నేతలు కలిశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ పార్టీలో కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని వారు అన్నారు.