ప్రభాస్ ‘డార్లింగ్’ రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజే రూ.7 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు మరో రూ.2 కోట్లు రాబట్టి మొత్తం రూ. 9.36 కోట్లకు చేరుకున్నట్లు టాక్ నడుస్తోంది. కాజల్ కథానాయికగా, జీవీ ప్రకాష్ సంగీతం, ప్రభు, చంద్రమోహన్ కీలక పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ ఫ్యాన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది.