AKP: నర్సీపట్నంలో ఒక్కసారిగా పుచ్చకాయలకు గిరాకీ పెరిగింది. ఇవాళ మార్కెట్లో పుచ్చకాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రాష్ట్రంలో పుచ్చకాయలు అందుబాటులో లేకపోవడంతో తమిళనాడు నుంచి తెప్పిస్తున్నామని వ్యాపారస్తులు పేర్కొన్నారు. నిన్నటి వరకు కేజీ పుచ్చకాయల ధర రూ. 30 ఉండగా ప్రస్తుతం కేజీ రూ. 50 కి అమ్ముతున్నామని వర్తకులు పేర్కొన్నారు.