ATP: హనీట్రాప్ ముఠాతో సంబంధాలున్న పోలీసులపై ఎస్పీ జగదీష్ కఠిన చర్యలు చేపట్టారు. అనంతపురం రూరల్, ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బందిని వీఆర్‌కు పంపారు. ఏఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు జయరాంనాయక్, దేవేంద్ర, మురళి, దేవానాయక్ వీఆర్‌కు వెళ్లిన వారిలో ఉన్నారు.