ADB: ఈనెల 25, 26వ తేదీల్లో మొక్కజొన్న కొనుగోలు నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ అధికారులు శనివారం తెలియజేశారు. ధాన్యాన్ని నిల్వచేసే గన్ని సంచులు అందుబాటులో లేకపోవడం వలన కొనుగోలు నిలిపివేయడం జరిగిందని వెల్లడించారు. తర్వాత కొనుగోలు తేదీని ఒకరోజు ముందుగానే తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు.