మంగళవారం ‘2026 HJ1’ అనే గ్రహశకలం భూమికి అతి సమీపంగా ప్రయాణించనుందని నాసా ప్రకటించింది. సుమారు 23 అడుగుల వెడల్పున్న ఈ గ్రహశకలం బస్సు పరిమాణంలో ఉంటుంది. ఇది భూమికి 6.4 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తుందని, దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గ్రహశకలాల కదలికలను పరిశోధించేందుకు శాస్త్రవేత్తలకు ఇది చక్కని అవకాశమని వారు పేర్కొన్నారు.