NZB: డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ యూనివర్సిటీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రానున్నారు. ఈ విషయాన్ని వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరిరావు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసంగంతో పాటు తన పాటలతో విద్యార్థులను ఉత్తేజపరచనున్నారు.