SRPT: యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను సీఎం రేపు ప్రారంభించనున్న నేపథ్యంలో మునగాల మండలంలోని, రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసార ఏర్పాటు చేయనున్నారు. మండలంలో మునగాల, ఆకుపాముల, రేపాల గ్రామాల్లోని రైతు వేదికల్లో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని, మునగాల మండల ఏవో బి.రాజు ఇవాళ రాత్రి ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.