WGL: నగరానికే తలమానికంగా నిలవబోతున్న 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. కాగా, ఈ ఆసుపత్రిని కేఎంసీతో అనుసంధానిస్తూ 200 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ఈ రోడ్డు నిర్మాణంతో వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యా బోధనకు, వైద్య సేవలకు, ఎమర్జెన్సీ రోగులు ఆసుపత్రి నుంచి KMCకి త్వరితగతిన చేరుకునే అవకాశం కలుగుతుంది.