ADB: ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చిత్రు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో చిత్రు పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు (BLO) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.