అఫ్ఘానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తండ్రయ్యాడు. తన భార్య మగ బిడ్డకు జన్మనిచ్చిందని అతడు ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నా లిటిల్ ప్రిన్స్‌కు స్వాగతం’ అంటూ రషీద్ ఓ పోస్ట్ పెట్టాడు. కాగా, తన కుమారుడికి ‘అస్లాన్ ఖాన్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు. దీంతో అతడికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.