RCB స్టార్ హిట్టర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డు సాధించాడు. IPL చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా డేవిడ్ రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 560 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ జాబితాలో రస్సెల్ (545 బంతులు) అగ్రస్థానంలో ఉండగా, హెడ్ (575 బంతులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.