MLG: ములుగు మున్సిపాలిటీ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఈ నెల 30లోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ రమేష్ శనివారం తెలిపారు. గృహ, వాణిజ్య యజమానులు కార్యాలయంలో లేదా ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించవచ్చని సూచించారు. గడువు ముగియకముందే పన్ను చెల్లించి రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.