TG: పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 మంది ఐపీఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు కల్పించారు. ప్రధానంగా ఏఎస్పీ స్థాయి అధికారులను వివిధ జిల్లాల్లో అదనపు ఎస్పీలుగా నియమించడం గమనార్హం.