AP: ప్రభుత్వ పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. నలుగురు IAS అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి, జిల్లా పరిపాలనలో సమర్థత పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన ఈ బదిలీల్లో యువ ఐఏఎస్ అధికారులకు కీలకమైన ఐటీడీఏ, జాయింట్ కలెక్టర్ బాధ్యతలను అప్పగించింది.