BDK: డీలిమిటేషన్ బిల్లు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శనివారం విమర్శించారు. అయితే, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నియంతృత్వ ధోరణితో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని ఆయన ఆరోపించారు.